![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -39లో.. అసలు నాపై ఇంత కోపం పెట్టుకొని నా కొడుకుని ఆ ఇంటికి అల్లుడు చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నారు. ఇందులో ఏదైన ప్లాన్ ఉందా నువ్వు సిరికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కోమని ధనకి మాణిక్యం ఫోన్ ఇస్తాడు. సిరికి ఫోన్ చెయ్యమని చెప్తాడు.
ఆ తర్వాత సిరికి ధన ఫోన్ చేసి.. మీ వాళ్ళు పెళ్లికి అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారని ధన అడుగుతాడు. మావాళ్లు మనస్ఫూర్తిగా మన పెళ్లికి ఒప్పుకున్నారని సిరి చెప్తుంది. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అని సిరి చెప్పగానే ధన షాక్ అవుతాడు. పక్కనే ఉన్న మాణిక్యం ఏమైందని అడుగుతాడు. నేను తర్వాత చేస్తానని ధన ఫోన్ కట్ చేసి సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం మాణిక్యానికి చెప్తాడు. దాంతో మాణిక్యం హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇందుకా ఒప్పుకున్నది మీ సంగతి చెప్తానని మాణిక్యం అనుకుంటాడు. చాలా మంచి న్యూస్ చెప్పావని ధనతో మాణిక్యం అంటాడు. ఆ తర్వాత మాణిక్యం డ్రింక్ చేస్తుంటే రామలక్ష్మి, సుజాత వాళ్ళు వస్తారు. ధన ఇల్లరికం గురించి అలోచించి అభిప్రాయం చెప్తానని అన్నారు కదా ఏం ఆలోచించారని రామలక్ష్మి అడుగుతుంది. మొదట వద్దన్న కూడా తర్వాత ఒప్పుకుంటున్నామని మాణిక్యం అంటాడు.. ఆ తర్వాత సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో చెప్పకని ధనకి మాణిక్యం చెప్తాడు. కానీ ఒక కండిషన్ వల్ల పద్ధతి ప్రకారం రేపు మన ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుకొని వెళ్ళాలని మాణిక్యం షరతు పెడతాడు.
ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి ఫోన్ చేసి.. మా నాన్న ధన ఇల్లరికం రావడానికి ఒప్పుకున్నాడు కానీ మీరు రేపు మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుకొని వెళ్ళాలని చెప్పాడు. అలా అని రామలక్ష్మి చెప్పగానే.. సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఇంట్లో అందరిని పిలిచి ధన ఇల్లరికం రావడానికి వల్ల ఫ్యామిలీ అంతా ఒప్పుకుంది కానీ మనం రేపు వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్ళాలని సీతాకాంత్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |